నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను
లూకా 5:31

అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు.

లూకా 5:32

మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

లూకా 15:4-7
4
మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవి లో విడిచిపెట్టి , తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్లడా ?
5
అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
6
మీరు నాతోకూడ సంతోషించుడి ; తప్పి పోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.
7

అటువలె మారుమనస్సు అక్కర లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును .

లూకా 15:32-7
యెహెజ్కేలు 34:16

తప్పిపోయిన దానిని నేను వెదకుదును , తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును , దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును ; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను .

మత్తయి 1:21

ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

మత్తయి 9:12

ఆయన ఆ మాటవిని–రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.

మత్తయి 9:13

అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.

మత్తయి 10:6

ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్లుడి.

మత్తయి 15:24

ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను

మత్తయి 18:11

మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల

రోమీయులకు 5:6

ఏలయనగా మన మింక బలహీనులమై యుండగా , క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను .

1 తిమోతికి 1:13-16
13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

14

మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

15

 

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను

16

అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నా యంద కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.

హెబ్రీయులకు 7:25

ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.

1 యోహాను 4:9-14
9

మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

10

మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

11

ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.

12

ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.

13

దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.

14

మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.