పూలు
1దినవృత్తాంతములు 5:25

అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.

1దినవృత్తాంతములు 5:26

కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.

యెషయా 9:1

అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

మెనహేము
2 రాజులు 12:18

యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్దనుండి తిరిగిపోయెను.

2 రాజులు 16:8

నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియా రాజు చేతిలోనుండియు ఇశ్రాయేలు రాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతల నంపగా

2 రాజులు 17:3

అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.

2 రాజులు 17:4

అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్య కపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరురాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.

2 రాజులు 18:16

మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజున కిచ్చెను.

హొషేయ 5:13

తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థ పరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.

హొషేయ 8:9

అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.

హొషేయ 8:10

వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.

హొషేయ 10:6

ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.

స్థిరపరచునట్లుగా
2 రాజులు 14:5

రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.

యిర్మీయా 17:5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.