యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును , అతడు అపాయమువలన చచ్చును , లేదా యుద్ధమునకు పోయి నశించును ;
యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును.
అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను.
ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.
అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.
హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
యెహోవా , ప్రతికారముచేయు దేవా , ప్రతికారముచేయు దేవా , ప్రకాశింపుము
ప్రియులారా , మీకు మీరే పగతీర్చు కొనక , దేవుని ఉగ్రతకు చోటియ్యుడి -పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
వారు- నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.
యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక . అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి