దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.
న్యాయాధిపతులు 9:24

అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

యోబు గ్రంథము 31:3

దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.

కీర్తనల గ్రంథము 9:12

ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు.

కీర్తనల గ్రంథము 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

కీర్తనల గ్రంథము 58:10

ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.

కీర్తనల గ్రంథము 58:11

కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.

కీర్తనల గ్రంథము 94:23

ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును . మన దేవుడైన యెహోవా వారిని సంహరించును .

సామెతలు 5:22

దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

మత్తయి 7:2

మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

అపొస్తలుల కార్యములు 28:4

ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పుకొనిరి.

గలతీయులకు 6:7

మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.

ప్రకటన 19:20

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

ప్రకటన 19:21

కడమవారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.