
గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.
మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.
వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
మాకు కాదు , యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను .
నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును .
యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును .
విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.
ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు , వాక్యముచేతను , క్రియచేతను , గురుతుల బలము చేతను , మహత్కార్యముల బలము చేతను , పరిశు ద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను .
కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగ ప్రకటించియున్నాను .
కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు
సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.
దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.