బండల సందులలోను దాగుకొని -సింహాసనాసీనుడైయున్నవానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధపడుచున్నాను ; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,
దుర్దశలోనున్నవారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖాక్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది.
సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను ఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలెనున్నవి, నా జోలికి రావద్దు.
అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు ఇదే.
ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును , ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును , పర్వతములను చూచిమమ్మును మరుగుచేయుడనియు , కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు .
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను , మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్ప సాగుదురు .