రక్షించు
రోమీయులకు 11:14

వారి లో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను .

1 కొరింథీయులకు 5:3-5
3

నేను దేహవిషయమై దూరముగాఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండినట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.

4

ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,

5

నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడివచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.

2 కొరింథీయులకు 7:10-12
10

దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.

11

మీరు దేవుని చిత్తప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టిదోషనివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులైయున్నారని ఋజువుపరచుకొంటిరి.

12

నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీకున్న ఆసక్తి దేవునియెదుట మీమధ్య బాహాటమగుటకే వ్రాసితిని.

1 తిమోతికి 4:16

నిన్నుగూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము , వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు .

లాగినట్టు
ఆమోసు 4:11

దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

జెకర్యా 3:2

సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.

1 కొరింథీయులకు 3:15

ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

అసహ్యించుకొనుచు
లేవీయకాండము 13:47-59
47

మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

48

నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి

49

ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.

50

యాజకుడు ఆ పొడను చూచి పొడగలవాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

51

ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.

52

కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.

53

అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల

54

యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.

55

ఆ పొడగలదానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.

56

యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.

57

అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.

58

ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసినదేనినేగాని ఉదికినతరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;

59

అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.

లేవీయకాండము 14:47

ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.

లేవీయకాండము 15:17

ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలమువరకు అపవిత్రమైయుండును.

యెషయా 64:6

మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

విలాపవాక్యములు 4:14

జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.

జెకర్యా 3:3-5
3

యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా

4

దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి-ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి-నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.

5

అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలుచుండెను.

1 కొరింథీయులకు 5:9-11
9

జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.

10

అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళి

11

ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.

1 కొరింథీయులకు 15:33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

2 థెస్సలొనీకయులకు 3:14

ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.

ప్రకటన 3:4

అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడ సంచరించెదరు.

ప్రకటన 3:18

నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.