నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను , సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.
ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువు నందు మీకు వందనములు చేయుచున్నాను.
నాకును యావ త్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
కెంక్రేయ లో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని , పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ,
ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను .
క్రీస్తు యేసు నందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును , అకులకును నా వందనములు చెప్పుడి.
అసుంక్రితుకును , ప్లెగోనుకును , హెర్మేకును , పత్రొబకును , హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు .
పిలొలొగుకును , యూలియాకును , నేరియకును , అతని సహోదరికిని , ఒలుంపాకును వారితో కూడ ఉన్న పరిశుద్దుల కందరికిని వందనములు .
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
సహోదరులారా , మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి .
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు ; వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు .
మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను . మీరు మేలు విషయమై జ్ఞానులును , కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను .
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును . మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
యేసుక్రీస్తునందుండువారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
నా ప్రార్థనలయందు;నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,
పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.
నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.
పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.
ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.