ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందు రేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
ద్వితీయోపదేశకాండమ 32:6

బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.

యోబు గ్రంథము 28:28
మరియుయెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరు లకు సెలవిచ్చెను.
కీర్తనల గ్రంథము 81:12
కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని.
సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

యెషయా 27:11
దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
యెషయా 29:14
కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
యిర్మీయా 4:22

నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.

యిర్మీయా 8:9

జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?

హొషేయ 4:6

నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు . నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును ; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నే నును నీ కుమారులను మరతును .

మత్తయి 13:14

మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

మత్తయి 13:15

గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది.

రోమీయులకు 11:25
సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
1 కొరింథీయులకు 3:19

ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;