నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
న్యాయాధిపతులు 2:3

మీరు చేసినపని యెట్టిది? కావున నేను –మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.

న్యాయాధిపతులు 2:11-15
11

ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి

12

తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.

13

వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.

14

కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.

15

యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.

న్యాయాధిపతులు 4:2

యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.

న్యాయాధిపతులు 4:3

అతనికి తొమ్మిదివందల ఇనుప రథములుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.

న్యాయాధిపతులు 10:7-10
7

యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక

8

వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.

9

మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయిమీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను

10

అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా

న్యాయాధిపతులు 14:4

అయితే ఫిలిష్తీయులకేమైన చేయుటకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.

న్యాయాధిపతులు 15:11

అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచి–ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు–వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.

న్యాయాధిపతులు 15:12

అందుకు వారు–మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోను–మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను.

1 సమూయేలు 13:3-7
3

యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.

4

సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.

5

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

6

ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.

7

కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదుదేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.

1 సమూయేలు 13:19-23
19

హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి.

20

కాబట్టి ఇశ్రాయేలీయు లందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.

21

అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.

22

కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనాతాను నొద్దను ఉన్నజనులలో ఒకని చేతిలోనైనను కత్తియేగాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.

23

ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.

2 రాజులు 17:20

అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.

2 రాజులు 17:23

తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.

2 రాజులు 24:14-16
14

అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.

15

అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.

16

ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.

యోహాను 18:31

పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా

యోహాను 19:15

అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.