ye
ఎఫెసీయులకు 5:21

క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.

హెబ్రీయులకు 13:17

మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

1 పేతురు 5:5

చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

సహాయముచేయుచు
1 కొరింథీయులకు 12:28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

1దినవృత్తాంతములు 12:18

అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

రోమీయులకు 16:3

క్రీస్తు యేసు నందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును , అకులకును నా వందనములు చెప్పుడి.

రోమీయులకు 16:9
క్రీస్తు నందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు .
ఫిలిప్పీయులకు 4:3

అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతు తోను నా యితర సహకారులతోను సువార్తపని లో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాన

3 యోహాను 1:8

మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.

ప్రయాసపడుచు
1 కొరింథీయులకు 3:9

మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

రోమీయులకు 16:6
మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు .
రోమీయులకు 16:12
ప్రభువు నందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు . ప్రియురాలగు పెర్సిసునకు వందనములు ; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను .
1 థెస్సలొనీకయులకు 1:3

మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

1 థెస్సలొనీకయులకు 2:9

అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీ

1 థెస్సలొనీకయులకు 5:12

మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి

1 తిమోతికి 5:17

బాగుగా పాలనచేయు పెద్దలను , విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని , రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను .

హెబ్రీయులకు 6:10

మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.

ప్రకటన 2:3

నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.