ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు , ఆయన నామము రోషముగల యెహోవా ; ఆయన రోషముగల దేవుడు .
ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునైయున్నాడు.
నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండ నిన్ను నశింపజేయును.
వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు.
వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి .
యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.
ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హానినొందనివాడెవడు?
దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?
ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము.
నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము.
కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.
అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై
జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.