తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను -నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు .
అంతట యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను -ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు ? నీ కొమ్మును తైలముతో నింపుము , బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను , అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును .
నీ కుమారు లందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారి వాడున్నాడు . అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు -నీవు వాని పిలువనంపించుము , అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా
అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను . అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను . అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడే , నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను . తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను .
నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.
యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.
దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?
ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?
యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి
నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా
నాతాను యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.
అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా
యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగియున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;
అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును.