కాలములను సమయములను
అపొస్తలుల కార్యములు 17:26

మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని,

ద్వితీయోపదేశకాండమ 29:29

రహస్యములు మన దేవుడైన యెహోవాకుచెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

దానియేలు 2:21

ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి , రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు .

మత్తయి 24:36

అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

మార్కు 13:32

ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు.

లూకా 21:24

వారు కత్తి వాత కూలుదురు ; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణ మగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును .

ఎఫెసీయులకు 1:10

ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

1 థెస్సలొనీకయులకు 5:1

సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

1 థెస్సలొనీకయులకు 5:2

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

1 తిమోతికి 6:15

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.

2 తిమోతికి 3:1

అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

తండ్రి తన స్వాధీనమందుంచుకొని
మత్తయి 20:23

ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.

మార్కు 10:40

నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను.