అంతట
యోహాను 5:19

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను–తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

యోహాను 8:28

కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

యోహాను 8:42

యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.

యోహాను 14:10

తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.

తీర్పుతీర్చుచున్నాను
యోహాను 8:15

మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

యోహాను 8:16

నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.

ఆదికాండము 18:25

ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు

కీర్తనల గ్రంథము 96:13

భూజనులకు తీర్పుతీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పుతీర్చును.

యెషయా 11:3

యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

రోమీయులకు 2:2

అట్టి కార్యములు చేయు వారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.

రోమీయులకు 2:5

నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

గనుక
యోహాను 4:34

యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.

యోహాను 6:38

తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.

యోహాను 8:50

నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.

యోహాను 17:4

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.

యోహాను 18:11

ఆ దాసుని పేరు మల్కు. యేసు–కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

కీర్తనల గ్రంథము 40:7

అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

కీర్తనల గ్రంథము 40:8

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

మత్తయి 26:39

కొంత దూరము వెళ్లి, సాగిలపడి– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

రోమీయులకు 15:3

క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొన లేదు గాని నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను. అని వ్రాయబడి యున్నట్లు ఆయనకు సంభవించెను.

హొషేయ 10:7-10
7

షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.

8

ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.

9

ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా

10

నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.