ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు
కీర్తనల గ్రంథము 41:9

నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను

మీకా 7:5

స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు ,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు , నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము .

మీకా 7:6

కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు , ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

యోహాను 7:41-43
41

మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

42

క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.

43

కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

యోహాను 9:16

కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.

యోహాను 10:19-21
19

ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

20

వారిలోఅనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

21

మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

యోహాను 15:18-21
18

లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

19

మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

20

దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల

21

అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.

యోహాను 16:2

వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.

అపొస్తలుల కార్యములు 13:43-46
43

సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.

44

మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.

45

యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.

46

అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొను

అపొస్తలుల కార్యములు 14:1-4
1

ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.

2

అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.

3

కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను.

4

ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.

అపొస్తలుల కార్యములు 28:24

అతడు చెప్పిన సంగతులు కొందరు నమి్మరి, కొందరు నమ్మకపోయిరి.