
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు .
నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను ; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను , కాంతి దానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్ని లోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను.
దానిలో నుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను , వాటి రూపము మానవ స్వరూపము వంటిది.
ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు.
వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి , వాటి అర కాళ్లు పెయ్య కాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను , నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
వాటి రెక్కలు ఒక దానినొకటి కలిసికొనెను , ఏ వైపునకైనను తిరు గక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను .
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి , కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు .
వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను , ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను ; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను .
అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను , అవి వెనుకకు తిరు గక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను .
ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు ; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను , ఆ అగ్ని అతికాంతిగా ఉండెను , అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను .
మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను .
నేను కన్ను లెత్తి చూడగా , నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను , అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను .
అతనిశరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను , అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను . అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.
అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.
అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడ సంచరించెదరు.
జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.