
అయ్యో పరిసయ్యులారా , మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు . వాటిని మానక వీటిని చేయవలసి యున్నది .
అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.
అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.
ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
అందుకు సమూయేలు -తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా ? ఆలోచించుము , బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు , పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము .
నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట 77బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?
అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను , దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
మనుష్యుడా , యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది ; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు , దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు , ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు .
అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.
శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.