రాకూడదని
లేవీయకాండము 23:27

ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.

నిర్గమకాండము 26:33

ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

నిర్గమకాండము 26:34

అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.

నిర్గమకాండము 30:10

మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపపరిహారార్థబలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను . మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను . అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది .

నిర్గమకాండము 40:20

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు శాసనములను తీసికొని మందసము లో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను .

నిర్గమకాండము 40:21

మందిరము లోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను .

1 రాజులు 8:6

మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బాలయమగు అతిపరిశుద్ధ స్థలములో,కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.

హెబ్రీయులకు 9:3

రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

హెబ్రీయులకు 9:7

సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

హెబ్రీయులకు 9:8

దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

హెబ్రీయులకు 10:19

సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

హెబ్రీయులకు 10:20

ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

చావకయుండునట్లు
లేవీయకాండము 16:13

ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను.

లేవీయకాండము 8:35

మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.

సంఖ్యాకాండము 4:19

వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను.

సంఖ్యాకాండము 17:10

అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.

మత్తయి 27:51

అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను;

హెబ్రీయులకు 4:14-16
14

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

16

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

హెబ్రీయులకు 10:19

సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

మేఘములో
నిర్గమకాండము 40:34

అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను .

నిర్గమకాండము 40:35

ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ల లేకుండెను .

1 రాజులు 8:10-12
10

యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.

11

కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవచేయుటకు నిలువలేకపోయిరి.

12

సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

2 దినవృత్తాంతములు 5:14

అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.

కరుణాపీఠము
నిర్గమకాండము 25:17-22
17

మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.

18

మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

19

ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను

20

ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.

21

నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

22

అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసముమీదనుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.