నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు , తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును , వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు .
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
నీవు నడిసముద్రమున పండుకొనువానివలెనుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలెనుందువు.
నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.
మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి .
మరియు మీరు కాలము నెరిగి , నిద్ర మేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటి కంటె ఇప్పుడు , రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి , తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు , కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు , కలహమైనను మత్సరమైనను లేకయు , పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము .
మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై , శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి .