యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
దేవా , చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము .
సైన్యములకధిపతివగు దేవా , చెరలోనుండి మమ్ము రప్పించుము . మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము .
యెహోవా,సైన్యములకధిపతివగు దేవా , చెరలోనుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము .
మా రక్షణకర్తవగు దేవా , మావైపునకు తిరుగుము .మా మీదనున్న నీ కోపము చాలించుము .
నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.
మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గ మును దయచేయుదును.
నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి , వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును .
అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును .
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును , మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను .
నూతన హృదయము మీ కిచ్చెదను , నూతన స్వభావము మీకు కలుగజేసెదను , రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను .
నా ఆత్మను మీ యందుంచి , నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
యెహోవా , నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా , సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము .
ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు--చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులునీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.
అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును,కృశించిన వారినందరిని నింపుదును.
కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థు లందరును వారి దేశములో కాపురముందురు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే,
మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును , సత్యమును అనుసరించు పురమనియు , సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని , వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధలలో కూర్చుందురు .
ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా -ఆ దినము లందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా ? యిదే యెహోవా వాక్కు .
అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.