రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక డును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.
నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.
అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.
నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగానా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.
ఆయన పట్టణమునకు సమీపించి నప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు ; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి .
(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరు గకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి , అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి , నీ లోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
నీలో రాతి మీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను .
నాకు బహు దుఃఖమును , నా హృదయములో మానని వేదనయు కలవు .
క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను , అబద్ధమాడుట లేదు .
పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది . సాధ్యమైనయెడల, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును .
వారు తమ పిల్లలను పెంచి నను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి
సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి.
నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగువా?
¸యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి యున్నారు నా కన్యకలును నా ¸యవనులును ఖడ్గముచేత కూలి యున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి దయ తలచక వారినందరిని వధించితివి.
ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక పోయెను శేషమేమియు నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు.
మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడు చున్నారు?
నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు కొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.
సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంటకుప్పలను కౌగిలించుకొనెదరు.
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.
వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.