సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు
నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగా రించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షము లన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను .
కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి , తన కొన మేఘముల కంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను .
కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమివేసి , జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను ; ఆ జనము అతనికి తగినపని చేయును .
రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .
తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును; మేలుచేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారిమీద నిలుపుదును .
అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.
పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను.
అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు.
విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును
యవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.
ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.
దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.
కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు.
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినైయున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది
గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.
వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడముట్టించును.