
అయినను నీవునేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగోపాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.
నీవుఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.
నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాపమేమి? అని నిన్నడుగగా
అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.
–యెహోవా దేనిబట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.
మరియు వారు–వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి
తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్కరించిరి
గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.
యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా
జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా
జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల
మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.
అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు
గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.