నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.
అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరక కుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను ; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వ భూత లమంత మహా పర్వత మాయెను .
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును . దాని కెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు ; అది ముందు చెప్పిన రాజ్యము లన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును .
చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు ; కల నిశ్చయము , దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
నేను యెరూషలేము చుట్టునున్న జను లకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను ; శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును.
ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును , దానిని ఎత్తి మోయు వారందరు మిక్కిలి గాయపడుదురు , భూ జను లందరును దానికి విరోధులై కూడుదురు .
ఇదే యెహోవా వాక్కు -ఆ దినమందు నేను గుఱ్ఱము లన్నిటికిని బెదరును , వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును , యూదా వారి మీద నా దృష్టి యుంచి జనముల గుఱ్ఱము లన్నిటికిని అంధత్వము కలుగజేతును .
మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనము లనందరిని ఈలాగున మొత్తును ; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును , వారి కన్నులు కనుతొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును .
ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరి మీద నొకరు పడుదురు.
యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజను లందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చబడును .
ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళెములో ఉన్న పశువు లన్నిటిమీదను తెగుళ్లు పడును .
మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
లోక మందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేము నకు రాని వారందరిమీద వర్షము కురువ కుండును .
ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రా కయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును , పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును .
ఐగుప్తీయులకును , పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనుల కందరికిని రాగల శిక్ష యిదే .
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;