దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొ మోను సామెతలు.
జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
అతడు మూడువేల సామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.
గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి .
గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాను , యాజకులలో పెద్దలను , ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా యొద్దకు పంపెను .
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలోను , యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయ కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు .
యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకా కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు .