ప్రకాశము
సామెతలు 13:9

నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

ఎజ్రా 9:8

అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లజేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయచూపియున్నాడు.

ప్రసంగి 11:7

వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.

ప్రకటన 21:23

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

ప్రకటన 22:5

రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

మంచి
సామెతలు 17:22

సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

సామెతలు 25:25

దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.

కీర్తనల గ్రంథము 89:15
శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.
లూకా 2:10-19
10

అయితే ఆ దూత భయ పడకుడి ; ఇదిగో ప్రజ లందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ;

11

దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు , ఈయన ప్రభువైన క్రీస్తు

12

దానికిదే మీ కానవాలు ; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను .

13

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత తో కూడనుండి

14

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను .

15

ఆ దూతలు తమ యొద్దనుండి పరలోకము నకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱల కాపరులు జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు ; మనము బేత్లెహేము వరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని

16

త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.

17

వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.

18

గొఱ్ఱల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

19

అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.

ఎముకలకు
సామెతలు 3:8

అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

యెషయా 58:11
యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.