మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను .
మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.
మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,
ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.
పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.
మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.
పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.
తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరియుండవలెను.
ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.
ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను.
కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.
ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.
మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,
అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను.
పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.
అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.
ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.
మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను
మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.
పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.
ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను.
నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
అప్పుడు -ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.