క్షమించి
1 సమూయేలు 15:25

కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను .

వేడుకొనుడనగా
నిర్గమకాండము 8:8

అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్దనుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.

నిర్గమకాండము 9:28

ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా

1 రాజులు 13:6

అప్పుడు రాజు నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.

యెషయా 26:16

యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి

రోమీయులకు 15:30

సహోదరులారా , నేను యూదయ లోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేము లో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర మగునట్లును ,

అపొస్తలుల కార్యములు 8:24

అందుకు సీమోను మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

యీ చావు
2 రాజులు 4:40

తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవ జనుడా , కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి .

2 కొరింథీయులకు 1:10

ఆయన అట్టి గొప్పమరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.