
అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.
నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.
నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను.
మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.
అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
నర పుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలు నకంటె జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు.
నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.