దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెననియున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.
నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను.
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా , ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను .
యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
అతడు తన స్నేహితుడై నందున లేచి ఇయ్యక పోయినను , అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసిన వన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను .
అటువలె మీరును అడుగుడి , మీ కియ్యబడును ; వెదకుడి , మీకు దొరకును ; తట్టుడి , మీకు తీయబడును .
అడుగు ప్రతివాని కియ్యబడును , వెదకువానికి దొరకును , తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను .
మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా ? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా ?
కాబట్టి మీరు చెడ్డవారై యుండియు , మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధా త్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను .
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?
ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.