కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను.
వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరుచేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
అతడు భయపడ వద్దు , మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి
యెహోవా , వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను .
ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటి దొకటి కనబడెను .
ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను , ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను . వాటి రూపమును పనియు చూడగా చక్రము లో చక్రమున్నట్టుగా ఉండెను .
అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను , వెనుకకు తిరుగకయే జరుగుచుండెను .
వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను , ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను .
ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను , అవి నేల నుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను .
ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే , అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను ; జీవికున్న ఆత్మ , చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను .
జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను , అవి నిలువగా ఇవియు నిలిచెను , అవి నేల నుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను .
మరియు జీవుల తలల పైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను . అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను .
ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొక దానిప్రక్క ఒకటి పైకి చాపబడియుండెను ; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను , ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును , అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను .
అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని ; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరమువలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను .
అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశమండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను .
వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము వంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనము వంటి దానిమీద నర స్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను . నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను , చుట్టును తేజోమయముగా కనబడెను .
వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను . ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము . నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను .
అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్ద నుండి ప్రవహించుచుండెను . వే వేలకొలది ఆయనకు పరిచారకులుండిరి ; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి , తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను .
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె1 ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.
అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా
మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.