మేల్కొనుము
కీర్తనల గ్రంథము 7:6

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

కీర్తనల గ్రంథము 12:5

బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అనియెహోవా సెలవిచ్చుచున్నాడు.

కీర్తనల గ్రంథము 35:23

నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యెమాడుటకు లెమ్ము.

కీర్తనల గ్రంథము 59:4

నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

కీర్తనల గ్రంథము 59:5

సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)

కీర్తనల గ్రంథము 78:65

అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను .

యెషయా 51:9

యెహోవా బాహువా , లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా ? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

మార్కు 4:38

ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి--బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.

విడనాడకుము
కీర్తనల గ్రంథము 44:9

అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

కీర్తనల గ్రంథము 74:1

దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద నీ కోపము పొగరాజుచున్నదేమి?

కీర్తనల గ్రంథము 88:14

యెహోవా , నీవు నన్ను విడుచుట యేల ? నీ ముఖము నాకు చాటుచేయుట యేల?