యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు కయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను.
శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే , జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు ,
సింహముయొక్క బలమునుండియు , ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను . అందుకు సౌలు -పొమ్ము ; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదు తో అనెను .
దావీదు -నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను .
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును ; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ; ఇశ్రాయేలీయులలో దేవు డున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును .
అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండు వారందరు తెలిసికొందురు ; యుద్ధము యెహోవాదే ; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి
తన సంచి లో చెయ్యి వేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను . ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను .
దావీదు ఫిలిష్తీయుని కంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను .
వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను . ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి .
దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా,సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.