దేవుడు - ఆకాశము క్రిందనున్న జలము లొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?
ఆయన భూ మండలము మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాసస్థలముగా ఏర్పరచెను.
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు . ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.