గూర్చి పాడుడి
కీర్తనల గ్రంథము 47:6

దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

కీర్తనల గ్రంథము 47:7

దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

కీర్తనల గ్రంథము 96:1

యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా , యెహోవామీద పాడుడి

కీర్తనల గ్రంథము 96:2

యెహోవామీద పాడుడి , ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి .

కీర్తనల గ్రంథము 98:1

యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.

కీర్తనల గ్రంథము 98:5

సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.

న్యాయాధిపతులు 5:3

రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి యెహోవాకు గానముచేసెదను.

యెషయా 12:5

యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.

యెషయా 12:6

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.

యెషయా 42:10-12
10

సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా , ద్వీపములారా , ద్వీప నివాసులారా , యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూ దిగంతములనుండి ఆయనను స్తుతించుడి .

11

అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.

12

ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక

ఎఫెసీయులకు 5:19

ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,

ప్రకటన 15:3

వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;

ప్రకటన 15:4

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

సంభాషణ చేయుడి
కీర్తనల గ్రంథము 77:12

నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

కీర్తనల గ్రంథము 78:4-6
4

యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

5

రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి

6

యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు

కీర్తనల గ్రంథము 119:27

నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

నిర్గమకాండము 13:8

మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.

నిర్గమకాండము 13:9

యెహోవా ధర్మశాస్త్రము నీ నోటనుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.

నిర్గమకాండము 13:14

ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.

ద్వితీయోపదేశకాండమ 6:6-9
6

నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.

7

నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.

8

అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.

9

నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.

లూకా 24:14-53
14

జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొకరితోనొకరు సంభాషించుచుండిరి.

15

వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;

16

అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

17

ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.

18

వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.

19

ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

20

మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?

21

ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి ; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను .

22

అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవార గానే సమాధి యొద్దకు వెళ్లి, ఆయన దేహమును కాన క వచ్చి

23

కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి .

24

మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని , ఆయనను చూడ లేదని ఆయనతో చెప్పిరి .

25

అందుకాయన అవివేకులారా , ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మంద మతులారా ,

26

క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమ లో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనము లన్నిటి లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను .

28

ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా

29

వారు సాయంకాలము కావచ్చినది , ప్రొద్దు గ్రుంకినది , మాతో కూడ ఉండుమని చెప్పి , ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను .

30

ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు , ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా

31

వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను .

32

అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండ లేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి .

33

ఆ గడియలోనే వారు లేచి , యెరూషలేము నకు తిరిగి వెళ్లగా , పదునొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి

34

ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి . వారిది విని

35

త్రోవలో జరిగిన సంగతులును , ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి .

36

వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి --మీకు సమాధానమవుగాకని వారితో అనెను .

37

అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై , భూతము తమకు కనబడెనని తలంచిరి .

38

అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు ? మీ హృదయములలో సందేహములు పుట్టనేల ?

39

నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి ; నన్ను పట్టి చూడుడి , నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతము న కుండవని చెప్పి

40

తన చేతులను పాదములను వారికి చూపెను .

41

అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారి నడిగెను .

42

వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి .

43

ఆయన దానిని తీసికొని వారి యెదుట భుజించెను .

44

అంతట ఆయన మోషే ధర్మశాస్త్రము లోను ప్రవక్తల గ్రంథములలోను , కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర వలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి '' అని వారితో చెప్పెను .

45

అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46

క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు

47

యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది .

48

ఈ సంగతులకు మీరే సాక్షులు

49

ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను ; మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను .

50

ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను .

51

వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకము నకు ఆరోహణుడాయెను .

52

వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి

53

యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.