నేనుమొఱ్ఱపెట్టుచున్నాను
యోబు గ్రంథము 10:3

దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

యోబు గ్రంథము 10:15-17
15

నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినైయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

17

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

యోబు గ్రంథము 16:17-19
17

ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

18

భూమీ, నా రక్తమును కప్పివేయకుము నా మొఱ్ఱకు విరామము కలుగకుండును గాక.

19

ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు.

యోబు గ్రంథము 21:27

మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

కీర్తనల గ్రంథము 22:2

నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

యిర్మీయా 20:8

ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలా త్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతు వాయెను.

విలాపవాక్యములు 3:8

నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.

హబక్కూకు 1:2

యెహోవా , నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు ? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షిం పక యున్నావు .

హబక్కూకు 1:3

నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు ? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు ? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి , జగడమును కలహమును రేగుచున్నవి .

న్యాయము దొరకదు
యోబు గ్రంథము 9:32

ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

యోబు గ్రంథము 13:15-23
15

ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.

16

ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

17

నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.

18

ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.

19

నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైననుండిన యెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.

20

ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.

21

నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము

22

అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తరమిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము

23

నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

యోబు గ్రంథము 16:21

నరపుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

యోబు గ్రంథము 23:3-7
3

ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

4

ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

5

ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

6

ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

7

అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును.కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్షనొందకపోవుదును.

యోబు గ్రంథము 31:35

నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

యోబు గ్రంథము 31:36

నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసికొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.

యోబు గ్రంథము 34:5

నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

యోబు గ్రంథము 40:8

నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?