remembrances
యోబు గ్రంథము 18:17

భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.

నిర్గమకాండము 17:14

అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.

కీర్తనల గ్రంథము 34:16

దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.

కీర్తనల గ్రంథము 102:12

యెహోవా , నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును .

కీర్తనల గ్రంథము 109:15

ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండును గాక.

సామెతలు 10:7

నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

యెషయా 26:14

చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

బూడిదె
ఆదికాండము 18:27

అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.

to bodies
యోబు గ్రంథము 4:19

జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

ఆదికాండము 2:7

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

2 కొరింథీయులకు 5:1

భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.