
రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును , హతమైన రాజ కుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంప బడకుండెను .
అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది .
ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది . వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు .
అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా... ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా
అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.
అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక
అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లు వారినిబట్టి నేనాలాగే చేసెదను.
వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.