దావీదు సేవకులను పట్టుకొని
కీర్తనల గ్రంథము 35:12

మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

కీర్తనల గ్రంథము 109:4

నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగపట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను .

కీర్తనల గ్రంథము 109:5

నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు . నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేషముంచుచున్నారు .

వారిని గొరిగించి
లేవీయకాండము 19:27

మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,

యెషయా 15:2

ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

యిర్మీయా 41:5

గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా

యిర్మీయా 48:37

నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి.

కత్తిరించి
యెషయా 20:4

అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొనిపోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.

యెషయా 47:2

తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.

యెషయా 47:3

నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

వారిని పంపివేసెను
2 సమూయేలు 10:4

అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను.

2 సమూయేలు 10:5

ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు, ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగువరకు యెరికోపట్టణమందు ఆగి అటుతరువాత రండని వారితో చెప్పుడనెను.

2 దినవృత్తాంతములు 36:16

పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.

మార్కు 12:4

మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.

లూకా 20:10

పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

లూకా 20:11

మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.