So do God
2 సమూయేలు 3:35

ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణముచేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.

2 సమూయేలు 19:13

మరియు అమాశా యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను.

రూతు 1:17

నీవు మృతి బొందు చోటను నేను మృతిబొందెదను , అక్కడనే పాతిపెట్టబడెదను . మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.

1 సమూయేలు 3:17

ఏలీ-నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

1 సమూయేలు 14:44

అందుకు సౌలు -యోనాతానా , నీవు అవశ్యముగా మరణమవుదువు , నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను .

1 సమూయేలు 25:22
అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారు నప్పటికి నేనుండనియ్యను ; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.
1 రాజులు 19:2

యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.

as the Lord
1 సమూయేలు 15:28

అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను -నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు .

1 సమూయేలు 16:1-13
1

అంతట యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను -ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు ? నీ కొమ్మును తైలముతో నింపుము , బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను , అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును .

2

సమూయేలు -నేనెట్లు వెళ్లుదును ? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా -నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

3

యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము ; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ; ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా

4

సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను . ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి -సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

5

అతడు-సమాధానముగానే వచ్చితిని ; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి , యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.

6

వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి -నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను

7

అయితే యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము , మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు ; నేను అతని త్రోసివేసియున్నాను . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును .

8

యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు-యెహోవా ఇతని కోరుకొన లేద నెను .

9

అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు-యెహోవా ఇతనిని కోరుకొన లే దనెను .

10

యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు -యెహోవా వీరిని కోరుకొన లేదని చెప్పి

11

నీ కుమారు లందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారి వాడున్నాడు . అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు -నీవు వాని పిలువనంపించుము , అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

12

అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను . అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను . అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడే , నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

13

సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను . తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను .

1 సమూయేలు 28:17

యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు . నా ద్వారా ఆయన సెలవిచ్చి యున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు .

1దినవృత్తాంతములు 12:23

యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా

కీర్తనల గ్రంథము 89:3
నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను
కీర్తనల గ్రంథము 89:4
తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)
కీర్తనల గ్రంథము 89:19
అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.
కీర్తనల గ్రంథము 89:20
నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
కీర్తనల గ్రంథము 89:35-37
35
అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు
36
చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు
37
నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.