పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.
శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు.ఆకాశవైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకము లో ఏలాగు ప్రవేశించెనో , ఆలాగుననే మనుష్యు లందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను .
మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.
వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.