as God
అపొస్తలుల కార్యములు 11:15

నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.

అపొస్తలుల కార్యములు 15:8

మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

అపొస్తలుల కార్యములు 15:9

వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు

మత్తయి 20:14

నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

మత్తయి 20:15

నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.

రోమీయులకు 9:15

అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు -ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.

రోమీయులకు 9:16

కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.

రోమీయులకు 9:23

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటములయెడల, అనగా యూదుల లోనుండి మాత్రము కాక,

రోమీయులకు 9:24

అన్యజనము లలో నుండియు ఆయన పిలిచిన మన యెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?

రోమీయులకు 11:34-36
34
ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
35
ముందుగా ఆయన కిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు?
36
ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.
what
అపొస్తలుల కార్యములు 10:47

అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి

యోబు గ్రంథము 9:12-14
12

ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

13

దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14

కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

యోబు గ్రంథము 33:13

తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?

యోబు గ్రంథము 40:2

ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను.

యోబు గ్రంథము 40:8

నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?

యోబు గ్రంథము 40:9

దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?

దానియేలు 4:35

భూ నివాసు లందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూ నివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.

రోమీయులకు 9:20-26
20

అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా ?

21

ఒక ముద్ద లోనుండియే యొక ఘటము ఘనత కును ఒకటి ఘనహీనత కును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా ?

22

ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ యించినవాడై, నాశనము నకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతము తో సహించిన నేమి?

23

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటములయెడల, అనగా యూదుల లోనుండి మాత్రము కాక,

24

అన్యజనము లలో నుండియు ఆయన పిలిచిన మన యెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?

25

ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.

26

మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యే చోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయ లో ఆయన చెప్పుచున్నాడు.