
మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.
ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల ? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తర మియ్యకుండనేల ? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తి లేదా ? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును .
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
అయినను అందరు సువార్తకు లోబడ లేదు ప్రభువా , మేము తెలియజేసిన సమాచార మెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా ?
కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.
అయినను నేను చెప్పునదేమనగా , వారు విన లేదా ? విన్నారు గదా ? వారి స్వరము భూలోక మందంతటికిని , వారి మాటలు భూ దిగంతములవరకును బయలువెళ్లెను .
మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా ? జనము కాని వారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు .
మరియు యెషయా తెగించి -నన్ను వెదకనివారికి నేను దొరకితిని ; నన్ను విచారింపనివారికి ప్రత్యక్ష మైతిని అని చెప్పుచున్నాడు .
ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దిన మంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు .
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు . ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
ప్రభువా , వారు నీ ప్రవక్తలను చంపిరి , నీ బలిపీఠములను పడగొట్టిరి , నే నొక్కడనే మిగిలియున్నాను , నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు .
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది ? బయలుకు మోకా ళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ఆలాగుననే అప్పటి కాల మందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది .
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు ; కానియెడల కృప ఇకను కృప కాకపోవును .