
అందుకు యేసు–మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
యేసు వానితో–సాతానా, పొమ్ము–ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో , అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసుల గుదురని మీరెరుగరా ?
మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో , దానికి హృదయ పూర్వకముగా లోబడినవారై ,
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ; ఇందుకు దేవునికి స్తోత్రము .
మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను ; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో , ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి .
మీరు పాపమునకు దాసులై యున్న ప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి .
అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను ? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే ,
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము ; దాని అంతము నిత్య జీవము .
శరీరా నుసారులు శరీర విషయములమీద మనస్సు నుంతురు ; ఆత్మా నుసారులు ఆత్మ విషయములమీద మనస్సు నుంతురు ; శరీరానుసారమైన మనస్సు మరణము ;
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది ; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు , ఏమాత్రమును లోబడనేరదు .
కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు .
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషిం పకుంటే వాడు నా శిష్యుడు కానేరడు .