vowed
ఆదికాండము 28:20

అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

న్యాయాధిపతులు 11:30

అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల

1 సమూయేలు 1:11

సైన్యములకధిపతివగు యెహోవా , నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి , నీ సేవకురాలనైన నన్ను మరు వక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల , వాని తల మీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రా నియ్యక , వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను . ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను ,

2 సమూయేలు 15:7

నాలుగుసంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి –నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా –యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించెదనని మ్రొక్కుకొంటిని గనుక,

2 సమూయేలు 15:8

నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా

కీర్తనల గ్రంథము 56:12

దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.

కీర్తనల గ్రంథము 56:13

నేను నీకు మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతియాగములనర్పించెదను.

కీర్తనల గ్రంథము 116:18

ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

కీర్తనల గ్రంథము 132:2

అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి

చేసెదమనిరి
లేవీయకాండము 27:28

అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.

లేవీయకాండము 27:29

మనుష్యులు ప్రతిష్ఠించువాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.

ద్వితీయోపదేశకాండమ 13:15

ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.

యెహొషువ 6:17

ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.

యెహొషువ 6:26

ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

1 కొరింథీయులకు 16:22

ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు