ఈలాగున చెప్పెను -మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివా డగుననగా , అతడు మీ కుమారులను పట్టుకొని , తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును , కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు .
మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రా ధిపతులుగాను పంచదశా ధిపతులుగాను నియమించును ; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును .
మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకుల కిచ్చును .
మీ ధాన్యములోను ద్రాక్షపండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును .
మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును .
మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసు లవుదురు .
ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవి నక పోవును అనెను.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టునున్న సమస్త జనమువలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన యెడల. నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.
నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.
అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.
తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.
మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;
అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై
తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.
మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా , మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును ; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును . అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము .
అయితే అతడు తన పని వారిలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.
జనులు తమ స్వాస్థ్యము ననుభవింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను .
ప్రతి వాడును పై అధికారులకు లోబడియుండవలెను ; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి .
కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు .
ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు ; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ; వారికి భయ పడక ఉండ కోరితివా , మేలు చేయుము , అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు .
నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము , వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు .
కాబట్టి ఆగ్రహభయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము .
ఏలయనగా వారు దేవుని సేవకులై యుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.
ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు ? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును , ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును , ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి .
రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.
రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.