అతడు ప్రభువు కోపపడనియెడల నేనింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.
దేశనివాసుల చెడుతనమునుబట్టి
ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను .
అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి
కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
ఎండమావులు మడుగు లగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలో చింపరా ? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల ? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తర మియ్యకుండనేల ? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తి లేదా ? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును .
రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొను
అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడియున్నదని మీరు తెలిసికొందురు గాక,
వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను . వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును , వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను . నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
వారి లో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను .
వారిని విసర్జించుట , లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల , వారిని చేర్చుకొనుట యేమగును ? మృతులు సజీవులైనట్టే అగును గదా ?
ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైన దైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైన దైతే కొమ్మలును పరిశుద్ధములే.
అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి , అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి , ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము .
నీవు అతిశయించితివా , వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు .
అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు .
మంచిది ; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి , నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు ; గర్వింపక భయపడుము ;