లేడు
న్యాయాధిపతులు 17:6

ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.

న్యాయాధిపతులు 18:1

ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకుకొనుటకై వారు బయలుదేరియుండిరి.

న్యాయాధిపతులు 19:1

ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా

ఇష్టానుసారముగా
న్యాయాధిపతులు 18:7

కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యము లేకుండుటయు చూచిరి.

ద్వితీయోపదేశకాండమ 12:8

నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు.

కీర్తనల గ్రంథము 12:4

మా నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు.

సామెతలు 3:5

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము

సామెతలు 14:12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

ప్రసంగి 11:9

¸యవనుడా, నీ ¸యవనమందు సంతోషపడుము, నీ¸యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;

మీకా 2:1

మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు .

మీకా 2:2

వారు భూములు ఆశించి పట్టుకొందురు , ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు , ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు .