గెలువ లేకపోయిరి
ప్రకటన 12:11

వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.

కీర్తనల గ్రంథము 13:4

నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయియుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.

కీర్తనల గ్రంథము 118:10-13
10

అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

11

నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

12

కందిరీగలవలె నామీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

13

నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.

కీర్తనల గ్రంథము 129:2

నా ¸యవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.

యిర్మీయా 1:19

వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 5:22

సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 16:18

మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

రోమీయులకు 8:31-39
31

ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?

32

తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయన తో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు ?

33

దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు ? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే ;

34

శిక్ష విధించువాడెవడు ? చనిపోయిన క్రీస్తుయేసే ; అంతే కాదు , మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

35

క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు ? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ?

36

ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దిన మెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడినవారము .

37

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటి లో అత్యధిక విజయము పొందుచున్నాము.

38

మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను ,

39

మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

వారికిక
యోబు గ్రంథము 7:10

అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

యోబు గ్రంథము 8:18

దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అది నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.

యోబు గ్రంథము 20:9

వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

యోబు గ్రంథము 27:21-23
21
తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
22
ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
23
మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
కీర్తనల గ్రంథము 37:10

ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

అపొస్తలుల కార్యములు 1:25

తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

యూదా 1:6

మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.